అన్నం కూడా తిననివ్వకుండా చిత్రహింసలు పెడుతున్నాడు: ఆలియా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ భార్య ఆలియా గురించి మనందరికీ తెలిసిందే.ఈ దంపతులకు 10 ఏళ్ళ క్రితమే వివాహం అయ్యింది.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.అయితే కొంతకాలం పాటు బాగానే ఉన్న వీరు ఆ తర్వాత నవాజుద్దీన్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.2020లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా నవాజ్ సోదరుడు తనను శారీరక హింసకు పాల్పడినట్లు ఆరోపించిన విషయం తెలిసిందె.2021లో నవాజు దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఆలియా.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

నవాజుద్దీన్ పై అలియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నన్ను నవాజుద్దీన్ వంట గదిలోకి కూడా అనుమతించలేదు.

రూమ్ లో సోఫాలోనే నా బెడ్ ను తయారు చేసుకున్నాను.ఆహారం పంపే స్నేహితులను కూడా లోపలికి రానివ్వలేదు.

Advertisement

నేను బయటకు వెళ్ళడానికి భయపడుతున్నాను.కనీసం పూర్తిగా ఆహారం తీసుకునేందుకు కూడా గేటు వద్దకు వెళ్లలేక పోతున్నాను అని చెప్పుకొచ్చింది ఆలియా.

నా గది తలుపులు మూసి ఉంచారు.ఈ విషయంలో పోలీసులకు తన స్టేట్మెంట్ ను నమోదు చేయడానికి రాలేదు.

దాంతో నాకు తెలిసిన లాయర్ ద్వారా దానిని పూర్తి చేయగలిగాను.నాకు దశాబ్ద కాలంగా నవాజుద్దీన్ తెలుసు అందుకే అతన్ని పెళ్లి చేసుకున్నాను.కాబట్టి అతని భార్యగా నేను ఇంట్లో ఎందుకు ఉండకూడదు.

కనీసం డెలివరీ ఏజెంట్లను కూడా ఇంట్లోకి అనుమతించడం లేదు.న్యాయబద్ధంగా ఇంట్లో ఉండేందుకు నాకు హక్కు ఉంది అని తెలిపింది ఆలియా.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

ఆలియా నవాజుద్దీన్ ఇప్పుడు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే.ఆలియా చేసిన వ్యాఖ్యలపై నవాజుద్దీన్ ఇప్పటివరకు స్పందించలేదు అని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు