తండ్రి నాలుగు పెళ్లిళ్లపై నరేష్ కొడుకు నవీన్ సంచలన వ్యాఖ్యలు.. కంట్రోల్ చేయలేమంటూ?

సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ ( Naresh ) విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించారు.

అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా నరేష్ ఎంతో సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈయన సక్సెస్ కాలేకపోయారు.ఒకరి కాదు ఇద్దరు కాదని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు.

ఇలా ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh ) ను పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

Naveen Vijay Krishna Sensational Comments On Naresh Four Marriages, Naveen,nares

ఈ వయసులో నరేష్ నాలుగో పెళ్లి ( Fourth Marriage ) చేసుకోవడం పట్ల ఈయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉంటాయి.ఈయనకు పెళ్లి ఏజ్ దాటిపోయిన కొడుకు ఉన్నప్పటికీ తనకు పెళ్లి చేయకుండా ఈయన మాత్రం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ విమర్శలు కూడా వస్తుంటాయి  అయితే ఈ విమర్శల గురించి ఇటీవల నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ( Naveen Vijay Krishna ) స్పందించారు.నాన్న పెళ్లిళ్లు అనేది తన వ్యక్తిగతం ఆయన పెళ్లిళ్లు గురించి వచ్చే విమర్శలను తాను అసలు పట్టించుకోనని తెలిపారు.

Naveen Vijay Krishna Sensational Comments On Naresh Four Marriages, Naveen,nares
Advertisement
Naveen Vijay Krishna Sensational Comments On Naresh Four Marriages, Naveen,Nares

నాన్న ఒక పెద్ద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు ఆయనకు వేలకోట్లు ఆస్తులు ఉన్నాయి.ఇక ఆయన పెళ్లిళ్ల గురించి అందరూ విమర్శలు చేస్తుంటారు కానీ ఆయన పడిన బాధల గురించి ఎవరు మాట్లాడరు.కష్టంలో ఉన్నప్పుడు ఈ విమర్శించిన వారెవరు వచ్చి నాన్నను ఓదార్చలేదని తెలిపారు.

నేను కూడా ట్రోల్స్ చేస్తాను కానీ కొన్ని సెన్సిటివ్ విషయాల పట్ల తాను అసలు మాట్లాడనని తెలిపారు.ఇలా విమర్శించే వారిని మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేమని తెలిపారు.

ఇక తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ప్రస్తుతమైతే తాను సింగిల్ గానే ఉన్నానని, పెళ్లి చేసుకుని విడాకులు తీసుకొని విడిపోవడం కంటే సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం మంచిది నా జీవితంలోకి ఎవరైనా అమ్మాయి వస్తే స్వాగతిస్తాను లేకపోతే ఇలాగే ఉంటాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు