నవీన్ పొలిశెట్టి కొత్త ప్రాజెక్ట్‌ పరిస్థితి ఏంటి?

పదేళ్ల కష్ణం తర్వాత నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty)కి జాతిరత్నాలు సినిమా తో బ్రేక్ దక్కింది.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ ని నవీన్ దక్కించుకున్నాడు.

ఆ ఫాలోయింగ్ ని సద్వినియోగం చేసుకుని సినిమా లు చేసుకుని ఉంటే కచ్చితంగా మరో విజయ్‌ దేవరకొండ రేంజ్ లో సక్సెస్ లను దక్కించుకునే వాడు, క్రేజ్ కూడా దక్కేది.

కానీ నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఆ తర్వాత కూడా మంచి సినిమా లను ఎంపిక చేసుకోవడం లో విఫలం అయ్యాడు.అనుష్క తో మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా( Miss Shetty Mister Polishetty ) ను చేసిన నవీన్ పొలిశెట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు.

అనుష్క తో నవీన్ సినిమా చేయాల్సింది కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కొందరు నవీన్ నిర్ణయాన్ని సమర్థించారు.ఆ సినిమా నిరాశ పర్చడం తో నవీన్ తప్పు చేశాడు అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

Advertisement

ఇక తదుపరి సినిమా విషయం లో అయినా నవీన్ వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ నవీన్ మాత్రం తన అనగనగా ఒక రాజు సినిమా( Anaganaga Oka Raju ) ను ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడో క్లారిటీ లేకుండా ఉంది.అసలు ఆ సినిమా ఔట్‌ పుట్‌ బాగా రాలేదని పక్కన పెట్టేశారు అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.సితార ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన సినిమా అవ్వడం వల్ల అనగనగా ఒక రాజు సినిమా విషయం లో చాలా మంది లో పాజిటివ్ బజ్ ఉంది.

అలాంటి సినిమా ను అయినా స్పీడ్‌ గా పూర్తి చేసి విడుదల చేస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమా లు రెండు జాతిరత్నాలు రేంజ్ లో హిట్ అయితేనే కెరీర్ గాడి లో పడినట్లు అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు