చలికాలంలో చుండ్రు చిరాకు తెప్పిస్తుందా.. ఈ న్యాచురల్ టోనర్ ను వాడితే 2 వాషుల్లో మాయమవుతుంది!

సాధారణంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే ప్రస్తుత ఈ చలికాలంలో చుండ్రు స‌మ‌స్య బాగా ఇబ్బంది పెడుతుంటుంది.వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా తలపై తేమ తగ్గిపోతుంది.

ఫలితంగా చుండ్రు స‌మ‌స్య తలెత్తుతుంది.ఇది తీవ్రమైన చిరాకును కలిగిస్తుంది.

దురద, జుట్టు డ్రై ( Itchy, dry hair )అవ్వడం ఇలా ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది.ఈ క్రమంలోనే చుండ్రును పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టోనర్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ టోనర్ ను వాడితే కేవలం రెండు వాషుల్లోనే చుండ్రు మాయం అవుతుంది.

Advertisement
Natural Toner For Removing Dandruff In 2 Washes! Dandruff, Dandruff Removal Tone

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోన‌ర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే రెండు తుంచిన బిర్యానీ ఆకులు( Biryani leaves ), వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), ఐదు లవంగాలు వేసి మరిగించాలి.దాదాపు వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేయాలి.

Natural Toner For Removing Dandruff In 2 Washes Dandruff, Dandruff Removal Tone

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన టోనర్ సిద్ధం అవుతుంది.

ఒక స్ప్రే బాటిల్ లో ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.

Natural Toner For Removing Dandruff In 2 Washes Dandruff, Dandruff Removal Tone
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే మాయం అవుతుంది.కేవలం రెండు వాషుల్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

Advertisement

ఈ టోనర్ చుండ్రును నివారించి స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది.తేమను అందిస్తుంది.

తాజా వార్తలు