దగ్గు దుంప తెంపేస్తుందా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే!

దగ్గు( cough ) ఒక్కసారి పట్టుకుంది అంటే దుంప తెంపేస్తుంది.ఓ పట్టాన అస్సలు వదిలిపెట్టదు.

పైగా ఇంట్లో ఒకరికి దగ్గు మొదలైతే మిగిలిన వారికి కూడా ఈజీగా వ్యాప్తి చెందుతుంది.దగ్గు చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ద‌గ్గు వ‌ల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోతుంటారు.తరచూ ద‌గ్గడం కార‌ణంగా తలనొప్పి కూడా వచ్చేస్తుంటుంది.

రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర ఉండదు ఈ క్రమంలోనే దగ్గును వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు టానిక్ లు వాడుతుంటారు.

Advertisement

అయితే సహజంగా కూడా దగ్గును తరిమి కొట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా పవర్ ఫుల్ గా పని చేస్తాయి.మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి,( Ginger powder ) హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేరుగా తీసుకుని.

ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని సేవించాలి.రోజుకు రెండు సార్లు అంటే ఉదయం సాయంత్రం ఇలా చేస్తే దగ్గు చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది.

అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఐదు నుంచి ఆరు ఫ్రెష్ తులసి ఆకులు, పావు టేబుల్ స్పూన్ పసుపు ( Turmeric )వేసుకొని ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఇలా రోజుకు రెండు సార్లు చేసినా కూడా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.ఈ డ్రింక్ వల్ల జలుబు సమస్య ఉన్నా సరే దూరం అవుతుంది.ఇక దగ్గు సమస్యతో బాధపడుతున్న వారు బయట ఆహారాలను పూర్తిగా దూరం పెట్టండి.

Advertisement

ఆయిలీ ఫుడ్స్ కు నో చెప్పండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ను ఎవైడ్ చేయండి.

ధూమ‌పానం మానుకోండి.గోరువెచ్చని నీటిని తరచూ తీసుకుంటూ ఉండండి.

తద్వారా దగ్గు నుంచి త్వరగా బయటపడతారు.

తాజా వార్తలు