వారంలో 2 సార్లు ఈ ఆయిల్‌ను రాస్తే జుట్టు నల్ల‌గా, ఒత్తుగా మెరిసిపోతుంది!

నిగ‌నిగ‌లాడే న‌ల్ల‌టి ఒత్తైన జుట్టు అందాన్ని మ‌రింత రెట్టింపు చేస్తుంది.అందుకే చాలా మంది ఆడ‌వారు అలాంటి జుట్టు కావాల‌ని తెగ తాప‌త్రాయ‌పడుతుంటారు.

ఈ క్ర‌మంలోనే జుట్టుపై ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే ఎంత శ్ర‌ద్ధ తీసుకున్నా.

ఏదో ఒక కార‌ణం చేత జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్ వంటివి ఎక్కువ శాతం మందిని వేధించే స‌మ‌స్య‌లు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ ఎఫెక్టివ్ ఆయిల్‌ను వాడితే ఆ రెండు స‌మ‌స్య‌ల నుంచి చాలా అంటే చాలా సుల‌భంగా బ‌ట‌య ప‌డొచ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ప‌ది జామ ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో క‌డిగి పెట్టుకున్న జామ ఆకులు, గుప్పెడు క‌రివేపాకు, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు, రెండు ల‌వంగాలు వేసి వాట‌ర్ వేయ‌కుండా గ్రౌండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వత స్ట‌వ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని.అందులో ఒక క‌ప్పు ఆవ నూనెను పోయాలి,

నూనె కాస్త హీట్ అవ్వ‌గానే అందులో గ్రౌండ్ చేసి పెట్టుకున్న మిశ్ర‌మాన్ని వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఉడికించిన మిశ్ర‌మాన్ని బాగా చ‌ల్లార‌బెట్టుకుని.అప్పుడు నూనెను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ నూనెను బాటిల్‌లో నింపుకుంటే నాలుగు వారాల పాటు వాడుకోవ‌చ్చు.ఈ న్యాచుర‌ల్ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి నాలుగు గంట‌లు లేదా నైట్ అంతా వ‌దిలేయాలి.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ఆపై మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది.

Advertisement

మ‌రియు కేశాలు షైనీగా కూడా మెరుస్తాయి.

తాజా వార్తలు