మొటిమలు మచ్చలు గా మారి ఎంతకీ పోవడం లేదా.. అయితే వాటిని ఇలా వదిలించుకోండి!

మొటిమలు( pimples ).దాదాపు అందర్నీ వేధించే కామ‌న్ చ‌ర్మ‌ సమస్యల్లో ఒకటి.

అయితే కొందరిలో మొటిమలు చాలా త్వరగా తగ్గిపోతుంటాయి.వీరికి పెద్ద సమస్య ఏమీ ఉండదు.

కానీ కొందరికి మాత్రం మొటిమలు మచ్చలుగా మారుతుంటాయి.ఈ మచ్చలు ఎంతకీ పోవు.

ఈ మొటిమల తాలూకు మచ్చల కారణంగా ముఖ సౌందర్యం తీవ్రంగా పాడవుతుంది.దాంతో ఈ మచ్చలు ఎలా వదిలించుకోవాలో తెలియక మదన పడుతుంటారు.

Advertisement
Natural Home Remedy For Removing Acne Scars! Home Remedy, Acne Scars, Latest New

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచుర‌ల్‌ రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.

Natural Home Remedy For Removing Acne Scars Home Remedy, Acne Scars, Latest New

ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎలాంటి మచ్చలు అయినా దెబ్బకు మాయం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్( Tea powder ) వేసి పది నిమిషాల పాటు మరిగించి.ఆపై డికాక్షన్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు పీల్ తొలగించిన బంగాళదుంప ( potato )ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, ఐదు టేబుల్ స్పూన్లు టీ డికాక్షన్ వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వ‌న్ టేబుల్ స్పూన్‌ కాఫీ పౌడర్, హాఫ్‌ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Natural Home Remedy For Removing Acne Scars Home Remedy, Acne Scars, Latest New
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు తాలూకు మచ్చలే కాదు ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

Advertisement

స్పాట్ లెస్ స్కిన్‌ మీ సొంతం అవుతుంది.అదే సమయంలో చర్మం నిగారింపుగా, కాంతివంతంగా సైతం మెరుస్తుంది.కాబట్టి మొటిమల తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు