నువ్వు మగాడివైతే నిరూపించు... తొందరలోనే నీ బండారం బయటపెడతా.? నిఖిల్ పై సంచలన కామెంట్స్!

హీరో నిఖిల్ సోమవారం లోపు క్షమాపణ చెప్పాలని లేదంటే ఆందోళన తీవ్ర తరం చేయడమే కాకుండా నిఖిల్ బండారం బయట పెడతానని హెచ్చరికలు జారీ చేసాడు నిర్మాత నట్టికుమార్ .అసలు ఏం జరిగింది అంటే.

నిఖిల్ కొద్ది రోజులుగా ‘ముద్ర ’అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు.కాగా తన సినిమా లోగో, పేరు వాడుకొని మరో సినిమా విడుదల చేస్తున్నారంటూ నిఖిల్‌ సోషల్‌ మీడియాలో మండిపడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా నిఖిల్‌ కామెంట్లపై నిర్మాత నట్టి కుమార్‌ స్పందించారు.ముద్ర సినిమా టైటిల్‌ తనదేనని పునరుద్ఘాటించారు.టైటిల్‌ తనది అనడానికి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు.

నిఖిలే కాదు ఎవరైనా దీనిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.‘ముద్ర’ టైటిల్ మీదైతే.

ఆధారాలు చూపించండి.లేదంటే సినిమాల నుంచి వైదొలగండి.

Advertisement

హీరో నిఖిల్ ఇప్పటి వరకు మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.లేదంటే పరిణామం వేరేలా ఉంటుంది అంటూ నట్టికుమార్ ఈ ప్రెస్ మీట్‌లో నిఖిల్ ‘ముద్ర’ టీమ్‌ను హెచ్చరించారు.

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘ముద్ర’ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా.జగపతిబాబు నటించిన ‘ముద్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే జగపతిబాబు నటించిన ‘ముద్ర’ సినిమాకు టికెట్ బుకింగ్ యాప్స్‌లో హీరో నిఖిల్ ఫొటోలను పెట్టడంతో.

ఆయన అభిమానులు ఈ విషయాన్ని నిఖిల్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయంపై నిఖిల్ కూడా ముందు చూసిచూడనట్లుగా వదిలేసినా.

తర్వాత నిఖిల్ నటిస్తున్న పోస్టర్స్ పెట్టడంతో.జగపతిబాబు నటించిన ‘ముద్ర’ టీమ్‌పై ఫైర్ అవ్వడంతో సినీ నిర్మాత ఇలా స్పందించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు