బలగాలను సిద్ధం చేసుకుంటున్న జాతీయ కూటములు !

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున తమ బలాబలాలను బేరీజు వేసుకుంటూ అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకున్న జాతీయ పార్టీలు 2024 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ vs బిజెపి కేంద్రంగానే ఉండబోతున్నట్లుగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసాయి.

మిగిలిన పక్షాలు అటొ ఇటొ నిలబడి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చాయి .

నిజానికి కాంగ్రెస్( Congress party ) బలపడకుంటే ప్రతిపక్ష కూటమి తరుపున పెద్దన్న పాత్ర పోషించడానికి బీహార్ ఎంపీ నితీష్ కుమార్ ( Nitish Kumar )గట్టిగా ప్రయత్నం చేశారు .మరో పక్క కెసిఆర్ కూడా థర్డ్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారే ప్రయత్నాలు కూడా చేశారు.అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇక భవిష్యత్తు ప్రతిపక్ష పార్టీ తమదే అన్నంత గా ముందుకెళ్లారు.

అయితే రకరకాల సమీకరణాల తర్వాత కర్ణాటక ఎన్నికలలో ఏకపక్షంగా అధికారం ఏర్పాటు చేసుకోవడంతో పాటు తెలంగాణలో కూడా బలపడే దిశ గా కాంగ్రెస్ ముందుకు వెళ్లడం తో మరో సారి కాంగ్రెస్ కు సారద్య బాద్యతలు అప్పచెప్పాల్సి వచ్చింది .

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చతిస్గడ్ లో కూడా కాంగ్రెస్కి వాతావరణం అనుకూలంగా ఉండడంతో మరోసారి కేంద్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే ప్రయత్నాలలో కాంగ్రెస్ ఉంది.దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి పెద్దన్న పాత్ర అనధికారకంగా కాంగ్రెస్సే వహిస్తుంది.వస్తున్న సర్వే రిపోర్టులు కూడా ప్రజలు బిజేపి(BJP ) కి ప్రత్యామ్నాయం గా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అంచనాలు ఉండడంతో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్కు ఆ హోదా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది .మరోవైపు ఎన్డీఏ కూడా తమ పాత మిత్రులతో కొత్తగా స్నేహం చేసే ప్రయత్నాలను మొదలు పెట్టింది.

Advertisement

తెలుగుదేశం పార్టీ, అన్నాడీఎంకే లతోపాటు జనసేనతో వంటి కొత్త పార్టీలతో ఎన్డిఏ ను బలపరిచే ప్రయత్నాలను మొదలుపెట్టింది .ఏది ఏమైనా రెండుసార్లు తన పరిపాలనలో కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో కొంత సంతృప్తిని కొంత అసంతృప్తినే మూట కట్టుకున్న మోడీ సర్కార్( Narendra Modi ) మరోసారి ప్రధాని పీఠాన్ని దక్కించుకోగలదా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం కొన్ని వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనం గా ఉండటం, మైనారిటీ హక్కుల విషయంలో దూకుడుగా ముందుకెళ్లడం వంటివి ఎన్డీఏ కి అడ్డంకిగా మారాయి .అయితే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షాలు బలపడకపోవడం ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వంటి విషయాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.మరి ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి తమ బలాబలాలను కూడగట్టుకుంటూ అంతిమ సమరానికి సిద్ధమవుతున్నాయి.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు