MLA Peddi Sudarshan Reddy: షర్మిల పాదయాత్రలో జరిగిన ఘటనపై స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే...

వరంగల్ జిల్లా: షర్మిల పాదయాత్రలో జరిగిన ఘటనపై స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే.మీడియా సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కామెంట్స్.

ఒక మహిళ కదాని ఓపిక పడపతుంటే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు.ఏపిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు లేవా?ముమ్మాటికి ఈ బాణాల వెనుక కేంద్రాన్ని నడిపే బీజేపీ ఉంది.ఆనాడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నడిపిన ప్రభుత్వాలలోని సమస్యలు గుర్తుకు రాలేదా.

Narsampeta Mla Peddi Sudharshan Reddy Shocking Comments On Ys Sharmila Details,

వైయస్ రాజశేఖర రెడ్డి పేరు తెలంగాణలో ఎందుకు.తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలోని సమస్యలను అడిగే హక్కు ఉంది కానీ వైయస్ షర్మిలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.

నా గురించి నా వ్యక్తిత్వం గురించి మాట్లాడే హక్కు షర్మిలకు ఎక్కడిది.నాపై ఉన్న ఆస్తులన్ని మీ ముందుంచుతా.

Advertisement

మీ ఆస్తులను కూడా ప్రజల ముందుంచాలి.విద్వేషపూరితమైన తప్పుడు మాటలు మాట్లాడితే మళ్లీ మీ పాదయాత్ర ఆగిపోతుంది.

ఆ పాదయాత్రను తెలంగాణ ప్రజలే ఆపుతారు.మా ప్రభుత్వంలో ఏమైన తప్పులుంటే సబ్జెక్టు పరంగా మాట్లాడండి స్వాగతిస్తాం.

ఏపి ప్రభుత్వంలో చేపట్టిన ప్రభుత్వ పథకాల పై మేము ప్రశ్నిస్తాం.వైయస్ జగన్ ప్రభుత్వం పై మీలాగే మాట్లాడుతాంహైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తాం.

ట్రాక్టర్ డ్రైవర్ వు ఎమ్మెల్యే ఎలా అయ్యాని ప్రశ్నించావు.నేను ముమ్మాటికి రైతు బిడ్డను.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

నన్ను అవమానపరిచావు దీనిపై షర్మిల స్పందించాలి.వేల కోట్లు సంపాదించావు అని అన్నారు కదా నన్ను.రేపు రండి ప్రజల సమక్షంలో మాట్లాడదాం.

Advertisement

ఎవరు వేల కోట్లు సంపాదించారో తేలుతుంది.పూర్వపు వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలోని భూముల బినామీలు ఎవరు.

మీకెక్కడివి.?పూర్వపు జిల్లాలో ఎవరికి మీకు, మీ భర్తకు భూములున్నాయో అందరికీ తెలుసు.వాటిలో జెండాలు పాతడానికి సిద్ధం.

నాకు తెలంగాణపై ప్రేమ ఉంది అని మాట్లాడే షర్మిల.ముందుగా కృష్ణ, గోదావరి లపై నీటి వాట ఎంత తేల్చమని మీ అన్నను, మీ బీజేపీ పెద్దలను అడుగు.గతంలో బయ్యారం గనులను అడ్డుకున్నది నేనే.

ఆ విషయాన్ని మీరు మర్చిపోయారనుకుంటా గుర్తు తెచ్చుకోండి.

తాజా వార్తలు