పాన్ ఇండియా స్పూఫ్ లతో సుడిగాడు సీక్వెల్.. నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మార్క్ కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో అల్లరి నరేష్( Allari Naresh ) ఒకరు.

తండ్రి మరణం అనంతరం సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులు పడిన నరేష్ ప్రస్తుతం కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ విజయాలను అందుకుంటున్నారు.

అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి మూవీ( Bachhala Malli Movie ) ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అల్లరి నరేష్ మధ్యలో కామెడీ సినిమాలు చేసినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు.అయితే అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు సుడిగాడు( Sudigadu ) అని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి నరేష్ స్పందించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

Naresh Comments About Sudigadu Sequel Details, Allari Naresh, Sudigadu Movie, Su
Advertisement
Naresh Comments About Sudigadu Sequel Details, Allari Naresh, Sudigadu Movie, Su

సుడిగాడు సినిమా రిలీజ్ సమయంలో హిందీ ఆడియన్స్ కు ఆ సినిమాలోని డైలాగ్స్ అర్థం కాలేదని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.ప్రేక్షకులు స్పూఫ్ లను కూడా అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు.తెలుగు సినిమాలు అంటే ఇంతేనేమో అని అనుకున్నారని అల్లరి నరేష్ పేర్కొన్నారు.

అయితే ఈసారి పాన్ ఇండియా సినిమాల స్పూఫ్ లు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు.

Naresh Comments About Sudigadu Sequel Details, Allari Naresh, Sudigadu Movie, Su

సుడిగాడు సీక్వెల్( Sudigadu Sequel ) స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని అల్లరి నరేష్ తెలిపారు.బచ్చలమల్లి సినిమాకు బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది.సినిమాకు హిట్ టాక్ వస్తే బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అల్లరి నరేష్ కు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

వెంకీ అట్లూరి ఇక తెలుగు హీరోలతో సినిమాలు చేయాడా..?
Advertisement

తాజా వార్తలు