మోడీ 'వాట్సాప్ ఛానల్'కు ఒక్క రోజులోనే మిలియన్ ఫాలోవర్స్!

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Modi ) గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించడం అవివేకం అవుతుంది.

ఎందుకంటే ఈ విజనరీ ప్రధానమంత్రి గురించి దేశ జనాలతో పాటు ప్రపంచ జనాలకు కూడా బాగా తెలుసు.

నేడు మన భారతదేశం ప్రపంచ పటంలో తన వునికిని చాటుకుంటుందంటే ఆ ఘనత ఆయనదే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.అందుకే మన మోడీజీకి ఎక్కడైనా తిరిగుండదు.

తాజాగా ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సాధించారు.ప్రముఖ సోషల్ మీడియా ‘వాట్సాప్’ ( Whatsapp ) తాజాగా అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ‘ఛానెల్స్’లోకి అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.

కేవలం ఒక్క రోజులోనే మిలియన్‌కు పైగా జనాలు ఫాలో కావడం విశేషం.

Advertisement

ఒక్క వాట్సాప్‌లోనే కాదు.సోషల్ మీడియాలో మోదీజీ హావా కొనసాగుతోంది అని ఈ సందర్బంగా చెప్పుకోవాలి.ట్విట్టర్(X)లో అత్యధికంగా 91 మిలియన్లు ఫాలోవర్స్ కలిగి వున్న మొదటి భారతతీయుడుగా ప్రధాని మోదీ ఆల్రెడీ రికార్డు క్రియేట్ చేశాడు.

అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో( Facebook ) 48 మిలియన్ ఫాలోవర్స్.ఇన్‌స్టాగ్రామ్‌‌లో( Instagram ) 78 మిలియన్ ఫాలోవర్స్ ఆయన్ని ఫాలో చేస్తున్నారు అంటే మీరు నమ్మితీరాల్సిందే.ఇక వాట్సాప్ అమలులోకి తీసుకొచ్చిన ‘ఛానెల్స్’లో( Whatsapp Channels ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చేరగా అనతికాలంలోనే ఆయన మిలియన్స్ ఫాలోవర్స్ సంపాదించుకోవడం రికార్డ్ అని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.

ఇక ఈ ఛానెల్ ద్వారా ప్రధాని విదేశీ పర్యటనలు, సాధించిన ఘనతలు, అవార్డులు, అప్‌డేట్స్ లాంటి సమాచారం అంతాకూడా వాట్సాప్‌ వినియోగదారులకు ఎప్పటికప్పుడు క్షణాల్లో అప్డేట్ అందుతుంది.ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా పోస్ట్ కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు.“వాట్సాప్ ఛానెల్స్‌లో చేరడం చాలా ఆనందం ఉంది.

మీతో కలిసి మరింత ముందుకు నడించేందుకు ఇది మరో అడుగు.ఇది కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఫోటో’ అంటూ వాట్సాప్ ఛానెల్‌లో తన మొదటి పోస్ట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు