బాలయ్య సినిమాలో నారా వారి అబ్బాయి..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు బోయపాటి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

Nara Rohit As MLA In Balakrishna Movie, Nara Rohit, Balakrishna, Boyapati Sreenu

ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకోవాలిన బోయపాటి చూస్తున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ఇందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర అయిన ఎమ్మెల్యేగా మరో యంగ్ హీరో నటిస్తాడని ఇప్పటికే ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

Advertisement

ఈ పాత్ర కోసం యంగ్ నటుడు నవీన్ పొలిశెట్టి పేరు గతంలో వినిపించింది.కానీ ఆయన ఈ సినిమాలో నటించడం లేదని తెలపడంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఆ పాత్రలో నటించేందుకు మరో యంగ్ హీరో నారా రోహిత్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నారా రోహిత్ అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తోంది.

బాలయ్య లాంటి స్టార్ హీరో చిత్రంలో నారా రోహిత్ నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా విలన్ పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పీరియడ్స్ లో నొప్పులా? ఈ చిట్కాలు పాటించండి
Advertisement

తాజా వార్తలు