ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం పై నారా లోకేష్ సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఫుల్ సంతోషంగా ఉంది.

విషయంలోకి వెళ్తే నేడు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించింది.23 ఓట్లతో ఘన విజయం సాధించింది.ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, మా తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యురాలు పంచుమర్తి అనురాధ( Panchumurti Anuradha ) గారికి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవ చేశావు.అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు.

చివ‌రికి అదే 23వ తేదీన‌, అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి-మా గెలుపు.ఇది క‌దా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు.

అంటూ సోషల్ మీడియాలో లోకేష్ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ వరుస విజయాలు సాధిస్తూ ఉండటం.

Advertisement

ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..
Advertisement

తాజా వార్తలు