సీఎం జగన్ పై రాయి దాడి ఘటన నిందితుడిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏప్రిల్ 13వ తారీకు విజయవాడలో "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో సీఎం జగన్( CM Jagan ) పై రాయి దాడి ఘటన జరగటం తెలిసిందే.

ముఖ్యమంత్రి జగన్ ఎడమ కనుబొమ్మపై రాయి చాలా బలంగా తాకింది.

ఈ ఘటనలో జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ( MLA Vellampalli Srinivas )కి కూడా గాయం కావడం జరిగింది.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటన కేసులో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేయడం కూడా జరిగింది.ఈ ఘటనలో వేముల సతీష్ నీ ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

Nara Lokesh Sensational Comments On The Accused Of Stone Attack On Cm Jagan, Td

ఇదిలా ఉంటే తాజాగా సీఎం జగన్ పై రాయి దాడి ఘటన కేసులో అరెస్ట్ అయిన వేముల సతీష్ పై నారా లోకేష్( Nara Lokesh ) సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు."గులకరాయి దాడి ఘటనలో తప్పుడు కేసు ఎదుర్కొంటున్న వడ్డెర కులస్తుడు, యవకుడు వేముల సతీష్ ను, అతని కుటుంబాన్ని మేం అధికారంలోకి రాగానే ఆదుకుంటాం.అతనిపై విజయవాడ పోలీసులు పెట్టిన తప్పుడు కేసు ఎత్తివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Advertisement
Nara Lokesh Sensational Comments On The Accused Of Stone Attack On CM Jagan, TD

అదే విధంగా తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారందరిని ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాను" అని అన్నారు.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !
Advertisement

తాజా వార్తలు