నారా లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు

టీడీపీ అధినేత నారా లోకేశ్ నిర్వహించనున్న ‘యువగళం’ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది.

ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఇందులో భాగంగా తొలి మూడు రోజులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ పాదయాత్ర కోసం నేతలు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా పాదయాత్ర ప్రణాళికను టీడీపీ రూపొందించింది.

అదేవిధంగా ఈ పాదయాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది.దాదాపు ఏడాదిపాటు కొనసాగే ఈ పాదయాత్ర లోకేశ్ ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

Advertisement
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...

తాజా వార్తలు