Nara Lokesh : 151 సీట్లు గెలిచి జగన్ ఏం సాధించారు..: నారా లోకేశ్

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్( TDP Nara Lokesh ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.151 సీట్లు గెలిచి జగన్ ఏం సాధించారో చెప్పాలన్నారు.

ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్( YS Jagan ) ఓటమిని ఒప్పుకున్నట్లని పేర్కొన్నారు.

సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కొత్త బాండ్లు తీసుకొచ్చారని తెలిపారు.ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు, మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.

వంద సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారన్న లోకేశ్ ఏపీలో వచ్చేది టీడీపీ - జనసేన ప్రభుత్వమేనని( TDP-Janasena ) ధీమా వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.ఒకవేళ ఉద్యోగాల కల్పన ఆలస్యం అయితే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని వెల్లడించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement