చిక్కుల్లో చంద్రన్న:లోకేష్ గట్టెక్కిస్తారా..?

తెలుగు జాతి చరిత్రలో ఇప్పటివరకు మాజీ సీఎం లిస్టుల్లో కేసులు నమోదై జైలుకు తరలిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు లేరు.

అందులో మొదటి వ్యక్తి చంద్రబాబు( Chandrababu Naidu) అని చెప్పవచ్చు.

అలాంటి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా పోలీసులు అరస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.

దీంతో కోర్టులో వాదనలు పూర్తి చేశారు.చివరికి మెజిస్ట్రేట్ తీర్పు చంద్రబాబును 14 రోజుల పాటు రిమాండ్( 14 Days Remand ) కు తరలించాలని వచ్చింది.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఖంగుతిన్నాయి.

ఇక నారా భువనేశ్వరి ( Bhuvaneshwari ) మాత్రం మీడియా ముఖంగానే కన్నీరు పెట్టింది.ఇక టిడిపి ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Advertisement

చంద్రబాబు చరిత్రలోనే ఈ అత్యంత విషాదకరమైన ఘటనని, అక్రమ కేసులు బనాయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.ఇదే తరుణంలో వైయస్సార్( YCP) పార్టీ నాయకులు చంద్రబాబు అక్రమాలు అన్ని బయటపడ్డాయని, అక్రమ నాయకుడికి తగిన శాస్తి జరిగిందంటూ మాట్లాడుతున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు.

వివాదాస్పదమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నారు.ఎంతోమంది టీడీపీ(TDP) శ్రేణులు కన్నీరు పెట్టుకుంటున్నారు.ఇదే తరుణంలో టిడిపి యువ నాయకుడు నారా లోకేష్( Nara Lokesh ) సకల వర్గాలకు ధైర్యం చెప్పి ఆలోచనతో ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది.

ఓవైపు తండ్రిని మరోవైపు వారికి ప్రాణమైనటువంటి పార్టీ శ్రేణులను, ఇంకోవైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ ఎత్తుకు, పైఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేయాలి.అప్పుడే నారా లోకేష్ప్ర జలకు భరోసా ఇచ్చే నాయకుడిగా మారతారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అలనాడు ఎన్టీఆర్(NTR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిడిపి సంక్షోభంలో ఉన్న సమయంలో చంద్రబాబు అన్ని తానై పార్టీని కాపాడి గట్టెక్కించారు కాబట్టే ఈనాడు అంతటి స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు.మరి ప్రస్తుతం అదే పార్టీ మళ్లీ చిక్కుల్లో పడబోతోంది.

Advertisement

లోకేష్ఈ విపత్కర పరిస్థితిని ఉపయోగించుకొని అందరినీ కలుపుకొని పార్టీని గట్టెక్కిస్తారా లేదంటే సైలెంట్ గా ఉంటారా.ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.