ఓటుకు నోటు ... అక్టోబర్ 8 న ఏం జరగబోతోంది..?

ఎన్నికల సమయం దగ్గరకు వస్తుందంటే చాలు రాజకీయ నాయకుల మీద మూలన పడిన కేసులన్నీ వెలుగులోకి వస్తుంటాయి.అయితే అవి సాధారణంగా తెరమీదకు వస్తున్నాయో.

లేక రాజకీయ ప్రయోజనాలకోసం వస్తున్నాయో అన్నది సమాధానంలేని ప్రశ్న.రేవంత్‌రెడ్డి ఇంటిలో సోదాలు చేసిన ఐటి అధికారులు అనుకున్న రీతిలో సమాచారాన్ని సేకరించలేక పోయారు.

కానీ.ఆయనకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని.

ఇవన్నీ చంద్రబాబు బినామా తాలుకా.అంటూ ప్రచారం చేశారు.

Advertisement

మీడియా కూడా దానికి తోడై చంద్రబాబు ఆస్తులకు రేవంత్‌రెడ్డి బినామీగా ఉన్నారని ప్రచారం చేసింది.

విదేశాల్లో పెద్ద ఎత్తున్న నిధులను చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు తరలించారని ఊదరగొట్టింది అయితే తీరా చూస్తే.ఓటుకు నోటు కేసునే ప్రధాన ఆయుధం గా చేసుకుని బిజెపి పెద్దలు ఐటిని ఉసిగొల్పారని తెలుస్తోంది.మూడు రోజుల పాటు రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడులు చేసిన ఐటి అధికారులు.

ఆయనను పలు రకాలుగా ప్రశ్నించారని.ఆయన ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లపై దాడులు చేయబోతున్నారని మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి.

ఓటుకు నోటు కేసులోనే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి.అనంతరం చంద్రబాబుపై దాడులు చేయాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించారని తెలుస్తోంది.అక్టోబర్‌ 8వ తేదీన ఒక సంచలన విషయం జరగబోతోందని కొన్ని పత్రికలు, సోషల్‌మీడియా లో ఒకటే కథనాలు వస్తున్నాయి.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన

సంచలన విషయం ఏమిటో చెప్పకుండా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆ రోజున ఆయనపై, మంత్రి లోకేష్ వారి సంస్థ‌లపై ఐటి దాడులు జరుగుతాయని కథనాలు వండి వారుస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.

Advertisement

ఓటుకునోటు కేసు ఏపీ, తెలంగాణల్లో రాజకీయ కాకా రేపేలా కనిపిస్తోంది.అయితే అక్టోబర్ 8 న ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

తాజా వార్తలు