సగం హైదరాబాద్ కొనేయాలనుకున్న హీరో నాని..??

నేచురల్ స్టార్ నాని ( Nani ) మణిరత్నం సినిమాలు చూస్తూ మూవీస్ పై చాలా మక్కువ పెంచుకున్నాడు.ఈ హీరో మొదట దర్శకుడు కావాలనుకున్నాడు.

అందుకే రాధా గోపాలం (2005)లో "క్లాప్ డైరెక్టర్" గా పనిచేశాడు.అతను అల్లరి బుల్లోడు, అస్త్రం, ఢీ (2007) వంటి సినిమాలకూ పనిచేశాడు.

స్క్రిప్ట్ రాయడానికి బ్రేక్ తీసుకున్నాడు.వరల్డ్ స్పేస్ శాటిలైట్‌కి RJ అయ్యాడు.

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి అతనిని ఒక ప్రకటనలో గమనించి అష్టా చమ్మా (2008)( Ashta Chamma ) మూవీలో హీరోగా అవకాశం ఇచ్చాడు.నాని ఈగ (2012), ఎవడే సుబ్రమణ్యం (2015), జెర్సీ, భలే భలే మగాడివోయ్, వంటి చిత్రాలతో స్టార్ హీరో అయిపోయాడు.

Advertisement

అయితే ఈ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో హైదరాబాద్( Hyderabad ) కొనేయాలని భావించాడట.అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ హీరో ఓ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక రూ.4,000 సంపాదించాడు.అదే అతని మొదటి జీతం.

అయితే ఫస్ట్ శాలరీ( First Salary ) జేబులో పెట్టుకుని బండిపై తన రూమ్ కి వెళ్తున్నప్పుడు అతనికి ఎంతో ఆనందం వేసిందట.అంతేకాదు ఆ డబ్బుతో సగం హైదరాబాదు కొనేయాలి అని అనుకున్నాడట.

ఆ ఫస్ట్ శాలరీ కలిగించిన ఫీలింగ్ చాలా గొప్పగా అనిపించిందని, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా అలాంటి ఫీలింగ్ రావట్లేదని నాని చెబుతున్నాడు.

ఇకపోతే ఇప్పుడు ఈ హీరో ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఎర్న్ చేస్తున్నట్లు సమాచారం.నాని 2013లో డి ఫర్ దోపిడీ చిత్రాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ గా మారారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఈ నటుడు బిగ్‌బాస్ తో( Bigg Boss ) పాటు కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహరించి ఆశ్చర్యపరిచాడు.కొన్ని సినిమాలకు వాయిస్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేశాడు.

Advertisement

ఇంకా యాడ్స్ లో నటిస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు.కేవలం నాలుగు వేల జీతంతో అతడి ప్రయాణం మొదలైంది.

ఇప్పుడు జస్ట్ సింగల్ సినిమాకి పాతిక కోట్లు తీసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.ఈ నేచురల్ స్టార్ చివరిసారిగా హాయ్ నాన్న మూవీ తో మెప్పించాడు.

ఇప్పుడు సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు.ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్.

ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు