బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న నాని సూపర్ హిట్ మూవీ

సౌత్ సినిమాలపై బాలీవుడ్ హీరోలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ద్రుష్టి పెట్టారు.

సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ వందల కోట్లు కలెక్షన్ సొంతం చేసుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు సౌత్ సినిమాలని రీమేక్ చేసి సూపర్ స్టార్స్ గా ఎదిగారు.ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ సినిమాలపై మోజు పడుతున్న హీరోల జాబితాలో షాహిద్ కపూర్ కూడా చేరిపోయాడు.

అర్జున్‌ రెడ్డి రీమేక్‌ గా తెరకెక్కిన కబీర్‌ సింగ్‌ తాజాగా హిందీ ప్రేక్షకులని అలరిస్తున్న షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సూపర్ హిట్ సినిమాల మీద ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.కబీర్ సింగ్ సక్సెస్ తో బాలీవుడ్ నిర్మాతలు కూడా తెలుగు సినిమాలపై శ్రద్ధ చూపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో నాని హీరోగా నటించిన జెర్సీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఎమోషనల్‌ ఎలిమెంట్స్ తో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో నడిచిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని కంటెంట్‌, ఎమోషన్స్‌ బాలీవుడ్‌ ఆడియన్స్‌ని కూడా మెప్పిస్తాయనే నమ్మకంతో దీని హక్కులని కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్నాడు.వేరే దర్శకులు అయితే కథని మార్చేయడానికి ప్రయత్నిస్తారు కనుక ఒరిజినల్‌ తీసిన గౌతమ్‌ తిన్ననూరితోనే ఈ చిత్రం రీమేక్‌ చేయబోతున్నాడు.

ఇందులో కథానాయకుడిగా షాహిద్‌ కపూర్‌ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఎమోషన్స్‌ని బాగా పలికించగలగడంతో పాటు మిడిల్‌ ఏజ్డ్‌ క్రికెటర్‌ పాత్రకి షాహిద్‌ సరిగ్గా సరిపోతాడు కనుక అతని మీదనే కరణ్ ద్రుష్టి పెట్టినట్లు సమాచారం.

Advertisement