పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాని.. వాళ్లంటే పిచ్చి ప్రేమ అంటూ?

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని ( Nani ) ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సరిపోదా శనివారం(Saripoda Shanivaram) .

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సీనియర్ డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే తప్పనిసరిగా యాంకర్ సుమ(Suma)తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడం అలాగే ఆమె యాంకర్ గా సినిమా ఈవెంట్లు చేయడం జరుగుతూ ఉంటుంది.తాజాగా యాంకర్ సుమతో కలిసి నాని ప్రియాంక మోహన్ యస్ జె సూర్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వారి కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడారు అంతేకాకుండా నాని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సుమ నానిని ప్రశ్నిస్తూ హీరో పవన్ కళ్యాణ్ గారిలోనూ మీలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నాకు సినిమాలంటే చాలా పిచ్చి ప్రేమ ఉంది.ఇక పవన్ కళ్యాణ్ గారికి మాత్రం జనాలు అంటే చాలా పిచ్చి ప్రేమ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఆ రెండు శాఖలపై చంద్రబాబు ఫోకస్ .. నేడు సమీక్ష
Advertisement

తాజా వార్తలు