వీకెండ్ కూడా అవ్వకముందే రికార్డ్.. అక్కడ నాని హవా మామూలుగా లేదుగా!

దసరా వంటి మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని ( Nani ) లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

నాని ప్రస్తుతం నటించిన హాయ్ నాన్న( Hi Nana ) సినిమా మొన్న డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాని అండ్ టీమ్ ముందు నుండి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగేలా చేశారు.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగ ఫస్ట్ షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.

మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.రిలీజ్ అయ్యిన ప్రతీ చోట మంచి స్పందన రావడంతో థియేటర్స్ లో నాని హవా కనిపిస్తుంది.

ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ మార్కెట్ లో కూడా నాని మరోసారి తన స్టామినా చూపిస్తున్నాడు.నాని సినిమాలకు ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది.ఇక్కడ ప్లాప్ అయ్యిన సినిమాలు కూడా యూఎస్ లో భారీ వసూళ్లను రాబడుతాయి.

Advertisement

మరి తాజాగా హాయ్ నాన్న సినిమా కూడా రికార్డులు సృష్టించే దిశగా వెళుతుంది.

వీకెండ్ కూడా పూర్తి కాకుండానే హాయ్ నాన్న సినిమా 1 మిలియన్ మార్క్ కు చేరువలో ఉన్నాడు.ఈ సినిమా 9 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ టచ్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.ఇది వీకెండ్ గడిచేసరికి మరింత పెరిగి 1 మిలియన్ మార్క్ దాటేయనుంది.

దీంతో నాని ఖాతాలో మరో 1 మిలియన్ మార్క్ మూవీ చేరినట్టే అని చెప్పాలి.మరి లాంగ్ రన్ లో నాని ర్యాంపేజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కించగా ఇందులో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషించింది.అలాగే నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్ గా నటించగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

హేషమ్ అబ్దుల్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు