ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు నాచురల్ స్టార్ నాని( Nani )ఒకరు.
ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నాని సోషల్ మీడియా వేదికగా గుండె బరువెక్కింది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
నాని ఇలా ఎమోషనల్ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు క్రితం నాని గౌతమ్ తిన్ననూరి ( Gautham Thinnanuri ) దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం జెర్సీ ( Jersey )ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఐదు సంవత్సరాలు కావడంతో తిరిగి ఈ సినిమానే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో విడుదల చేశారు.
ఈ స్పెషల్ షో చూడటానికి నాని తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.అయితే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాకి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అదే ఆదరణ లభించిందని చెప్పాలి.ఈ విధంగా ఈ సినిమాకి భారీ స్థాయిలో అభిమానులు ఈలలు వేస్తూ గోల చేస్తూ ఈ సినిమాని ఎంజాయ్ చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకి నేషనల్ అవార్డు( National Award ) రావడం కూడా విశేషం.
ఇలా ఈ సినిమాకు అదే స్థాయిలో ఆదరణ రావడంతో ఈయన సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఈ సినిమాకి వస్తున్నటువంటి ఆదరణ గురించి స్పందిస్తూ గుండె బరువెక్కింది.అభిమానుల ప్రేమతో మనసు నిండిపోయింది అంటూ ఈ సినిమాని ఇంతగా ఆదరించినటువంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ నాని షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక నాని ప్రస్తుతం సరిపోలేదా శనివారం అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు, త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy