'దసరా' హిట్ అయితే నాని ఆ విషయంలో పది మెట్లు ఎక్కినట్లే!

నాని హీరో గా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా దాదాపుగా రూ.

50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా మరో 30 కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

ఈ స్థాయిలో నాని సినిమా బిజినెస్ చేయడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రధమం.దసరా( Dussehra ) సినిమా కమర్షియల్ సక్సెస్ దక్కించుకొని రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబడితే కచ్చితంగా నాని కమర్షియల్‌ హీరో ఇమేజ్‌ విషయంలో పది మెట్లు పైకి ఎక్కినట్లే అవుతుందని సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.యంగ్‌ హీరోలు ఇతర హీరోలు కొంత మంది కమర్షియల్ సక్సెస్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

ఇలాంటి సమయంలో నాని( Nani ) అద్భుతమైన విజయాన్ని దసరా సినిమా తో దక్కించుకుంటే కచ్చితంగా ఆయనకు స్టార్ హీరోల సరసన స్థానం లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్తులో నాని తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు.క్రేజ్‌ విషయంలోనే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా నాని పది మెట్లు ఎక్కే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమా సక్సెస్‌ అయితే ఆమెకి కూడా వర్కౌట్‌ అవుతుంది.కనుక కచ్చితంగా ముందు ముందు వీరిద్దరూ పెద్ద స్టార్స్ గా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దసరా ఫలితం ఏంటి అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement