ఇంకెంత మందికి సిగ్నల్‌ ఇస్తావ్‌రా బాబు?

యంగ్‌ హీరో నాని కొన్ని నెలల క్రితం జెర్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా కమర్షియల్‌గా ఆడకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం జరిగింది.

ఆ చిత్రంలో నాని నటన పీక్స్‌లో ఉందంటూ ప్రశంసలు కురిశాయి.ఆ చిత్రం గురించిన విషయాలు ఇంకా మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలోనే గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌ లీడర్‌ విడుదల కాకుండానే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.తాజాగా మరో రెండు సినిమాలకు ఈయన కమిట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది.

గత రెండు వారాలుగా మన్మధుడు 2 చిత్ర దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో నాని ఒక సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.వీరిద్దరి మద్య ఆమద్య భేటీ కూడా జరిగింది.కథా చర్చల నిమిత్తం రెండు మూడు సార్లు కలిసినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Advertisement

దాంతో వీరిద్దరి కాంబో మూవీ దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ ప్రచారం జరుగుతోంది.ఈ సమయంలోనే నాని మరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా టాక్‌ వినిపిస్తోంది.

నిన్ను కోరి వంటి విభిన్నమైన సక్సెస్‌ను తనకు ఇచ్చిన శివ నిర్వాన దర్శకత్వంలో మరోసారి నాని నటించబోతున్నాడు.నిన్ను కోరి తర్వాత మజిలీ చిత్రాన్ని నాగచైతన్య మరియు సమంతల కాంబినేషన్‌లో తెరకెక్కించిన శివ నిర్వాన రెండవ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు మూడవ సినిమాగా నానితో సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఇప్పటికే చేస్తున్న సినిమాలు కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేయక ముందే శివ నిర్వాన మూవీని నాని మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్న నానిని చూసి తోటి హీరోలు కూడా అవాక్కవుతున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement