నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కూడా ప్రలోభ పెట్టారని తెలిపారు.

టీడీపీకి ఓటు వేయాలని అజయ్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేశారని చెప్పారు.టీడీపీకి ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆశ చూపారని వెల్లడించారు.

కాగా టీడీపీ ప్రలోభపెట్టిందని ఇప్పటికే రాజోలు ఎమ్మెల్యే రాపాక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే ఆర్థర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement