నాన్నను చాలా అవమానించారు...నాన్న చేసి చూపించారు: తేజస్విని నందమూరి

బాలకృష్ణ( Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్( Unstoppable Show ) కార్యక్రమం సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని( Tejaswini ) నందమూరి కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తేజస్విని తన తండ్రి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తేజస్విని మాట్లాడుతూ.అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేయబోతున్నారని తెలియగానే కొంతమంది చాలా రకాలుగా అవమానించారు.సెటైరికల్ కామెంట్స్ చేశారని తేజస్విని తెలిపింది.

Advertisement

కానీ నాన్న బలం ధైర్యం.ఏ పని చేసినా ఆయన ధైర్యంగా చేస్తారు.

అందుకే ఆయనపై వచ్చిన విమర్శలకు భిన్నంగా అన్ స్టాపబుల్ షో మోస్ట్ పాపులర్ షో అయింది.ఈ షోలో నాన్న ఎవరు చూడని యాంగిల్ ను చూపించారు.

నాన్న కెరియర్ పరంగా వేయని గెటప్ లేదు, చేయని పాత్ర లేదని తెలిపారు.

నాన్న ఏ పని చేసినా చాలా ధైర్యంగా చేస్తారు.ఆ ధైర్యమే హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచేలా చేసింది అంటూ తన తండ్రిపై కూతురు ప్రశంసల వర్షం కురిపించారు.ఇక ఈ షో గురించి తేజస్విని మాట్లాడుతూ ఈ షోలో ఎవరి ఊహకి అందని విధంగా ఉంటుంది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తేజస్విని తెలిపింది.అయితే గెస్టులు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు