తారకరత్న కు తోబుట్టువులు ఎంత మంది ? వారితో బందం ఎలాంటిది?

నందమూరి తారక రత్న మరణంతో తెలుగు ప్రేక్షకులు తల్లడిల్లుతున్నారు.40 ఏళ్లకే నిండు నూరేళ్ళు నిండిపోవడంతో తో అభిమానుల వేదనకు హద్దులు లేకుండా పోయాయి.

ఇక తారక రత్న కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

ఆరోగ్యం తో తిరిగి వస్తాడు అని 23 రోజులుగా ఎదురు చూస్తున్న వారికి కన్నీళ్లే మిగిలాయి.ఇక తారక రత్న భౌతిక కాయానికి రేపు అంత్య క్రియలు జరగనున్నాయి.

ఇప్పటికే నందమూరి అభిమానులు హైదరాబాద్ కి తారక రత్న చివరి చూపు కోసం చేరుకుంటున్నారు.అయితే ఈ సమయంలో తారక రత్న వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా లో అనేక మంది వెతుకుతున్నారు.

నందమూరి తారక రామారావు కి ఐదవ కొడుకు అయిన మోహన్ కృష్ణ కు తారక రత్న జన్మించాడు.మోహన్ కృష్ణ సైతం ఇండస్ట్రీ లోనే ఉన్నాడు.ఛాయా గ్రహాకుడిగా చాలా ఏళ్ళు తెలుగు సినిమాలకు పని చేశాడు.

Advertisement
Nandamuri Taraka Rathna Siblings And Family Details, Nandamuri Taraka Rathna Sib

మోహన్ కృష్ణ ఇద్దరు సంతానం.కొడుకు తారక్ రత్న కాగా కుమార్తె పేరు రూప.

తారక రత్న కు చెల్లి రూప అంటే పంచ ప్రాణాలు.ఇక తారక రత్న అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Nandamuri Taraka Rathna Siblings And Family Details, Nandamuri Taraka Rathna Sib

ఈ పెళ్లి మోహన్ కృష్ణ కుటుంబానికి ఇష్టం లేకపోవడం తో చాలా ఏళ్లపాటు కుటుంబానికి తారక రత్న దూరం గానే ఉన్నాడు.ఇక అలేఖ్య తారక రత్న నటించిన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.అక్కడ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అయితే అలేఖ్య కి అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు కూడా కావడం తో నందమూరి కుటుంబం వీరి ప్రేమను వ్యతిరేకించింది.

Nandamuri Taraka Rathna Siblings And Family Details, Nandamuri Taraka Rathna Sib
రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

అయితే మోహన్ కృష్ణ తన గారాల పట్టి రూప వివాహం అంత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ పెళ్లి సమయం లోనే తారక రత్న మళ్ళీ కుటుంబం తో కలిసి పోయాడు.అప్పటి నుంచి అలేఖ్య సైతం నందమూరి కుటుంబానికి దగ్గరయింది.

Advertisement

ఆ తర్వాత వీరికి నక్షి అనే ఒక పాప కూడా జన్మించింది.ఇక తారక రత్న హాస్పిటల్ లో ఉన్న రోజు నుంచి మోహన్ కృష్ణ కుటుంబం హాస్పిటల్ లోనే ఉన్నారు.

ప్రస్తుతం బెంగళూర్ నుంచి హైదరాబాద్ కి మృత దేహాన్ని తరలించారు.రేపు మహా ప్రస్థానంలో అంత్య క్రియలు జరగనున్నాయి.

తాజా వార్తలు