నందమూరి మల్టీస్టారర్‌?

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్‌ల హవా సాగుతోంది.ఇప్పటికే పలు మల్టీస్టారర్‌ సినిమాలు వచ్చాయి.

కొన్ని తెరకెక్కుతున్నాయి, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.ఈ క్రమంలోనే నందమూరి మల్టీస్టారర్‌ రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లు కలిసి ఒక సినిమా చేసే అవకాశముందని, అందులో హరికృష్ణ ఒక ముఖ్య పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం అందుకోసం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

మొదట్లో కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లకు పెద్దగా పడేది కాదు.వీరిద్దరు కలిసింది చాలా తక్కువ.

Advertisement

కాని గత కొంత కాలంగా అన్నదమ్ములు ఇద్దరు కూడా దగ్గరయ్యారు.ఏ కార్యక్రమానికి హాజరు అయినా కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నారు.

ఇక ఒకరి సినిమా ఫంక్షన్స్‌కు మరొకరు హాజరు అవుతున్నారు.ఇలా కలిసి ముందుకు సాగుతున్న అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించాలనే ఆలోచనకు వచ్చారు.

దాంతో సన్నిహితులు అయిన కొందరు కథా రచయితలకు తమ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమాకు కథను రూపొందించాల్సిందిగా చెప్పారు.అన్ని అనుకున్నట్లుగా అయితే వచ్చే సంవత్సరంలో నందమూరి మల్టీస్టారర్‌ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

నందమూరి హీరోల కాంబోలో సినిమా వస్తే అది ఫ్యాన్స్‌కు భారీ పండుగే.

Advertisement

తాజా వార్తలు