ఆ విషయం లో విమర్శలను ఎదురుకుంటున్న నందమూరి హీరో...

సినిమా అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది.

అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ ఉంటారు.

అయితే ఇక్కడ చాలామంది సక్సెస్ అవుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు.ఇక వాటన్నింటికీ భరించుకొని ఇక్కడ ఉండగలమని అనుకున్న వారు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి ట్రైల్స్ చేసి తర్వాత అవకాశాలు లేక మళ్ళీ వెనుతిరిగి పోవడం వల్ల అదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అని ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దలు కొత్తవాళ్ళకి సలహాలను ఇస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి జగపతి బాబు హీరోగా వచ్చిన ధమ్(Dham Movie ) అనే సినిమాలో ఒక కీలకపాత్రలో నటించాడు.ఇక ఆ తర్వాత ఆయన ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ ఆయనకు నటుడిగా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు.

Nandamuri Hero Who Is Facing Criticism In That Regard, Chaithanya Krishna , Nand

ఇక ఇప్పుడు బ్రీత్ (breathe)అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమాతో ఆయన ఎంతవరకు మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.మరి ముఖ్యంగా ఆయన బాడి కూడా హెవీగా ఉండటం వల్ల హీరో గా అతన్ని ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Nandamuri Hero Who Is Facing Criticism In That Regard, Chaithanya Krishna , Nand

మినిమం బాడీ మెయింటెన్ చేయకుండా హీరో అయిపోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే నటనపరంగా వైవిధ్యాన్ని చూపిస్తే పర్లేదు కానీ నటనలో కూడా తేలిపోతే మాత్రం ఆయన పైన తీవ్రమైన విమర్శలు వస్తాయనడం లో ఎంత మాత్రం అతిశక్తి లేదు.ఇక ఇప్పటికే చైతన్యకృష్ణ (nandhamuri Chaithanya krishna) మీద చాలా విమర్శలు అయితే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు