సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న బాలయ్య వివాదాలు.. ఇదేం మొదటిసారి కాదు అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి.

ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా బాలయ్య బాబు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

బాలయ్య బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ, సహాయం అని కోరిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఉంటాడు.అడగకుండా కూడా చాలామందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు బాలయ్య బాబు.

Nandamuri Balakrishna Comments And Controversies, Balakrishna, Tollywood, Akkine

అయితే బాల చాలామంది బాలయ్య బాబు కోపాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు.కానీ బాలయ్య బాబు గురించి పూర్తిగా తెలిసినవారు బాలయ్య బాబు మనసు వెన్న అని అంటూ ఉంటారు.చాలా సందర్భాలలో బాలయ్య బాబు అభిమానులపై సీరియస్ అయ్యి కొట్టడం లాంటివి కూడా చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Nandamuri Balakrishna Comments And Controversies, Balakrishna, Tollywood, Akkine

అలా చేయడాన్ని చాలామంది తప్పు పట్టినప్పటికీ బాలయ్య బాబు మాత్రం తన ప్రవర్తన మాట తీరు మార్చుకోలేదు.ఇక చాలామంది బాలయ్య బాబు చేసేది కరెక్టే అని ఆయనకు అనుగుణంగా వాదిస్తూ ఉంటారు.

తాజాగా బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో భాగంగా బాలయ్య బాబు అక్కినేని నాగేశ్వరరావు ని అక్కినేని గిక్కినేని అంటూ అనుచిత వాకిలి చేసిన విషయం తెలిసిందే.

Nandamuri Balakrishna Comments And Controversies, Balakrishna, Tollywood, Akkine

ఈ విషయం గురించి గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నిరసనలు నినాదాలు జరుగుతున్నాయి.చాలామంది అక్కినేని అభిమానులు వెంటనే బాలయ్య బాబు క్షమాపణలు తెలపాలి అంటూ సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు.కాగా బాలయ్య బాబు మొన్నటికి మొన్న బ్రహ్మణులకు, రావణ బ్రహ్మకు లింక్ పెడుతూ,బాలయ్య చేసిన వాఖ్యలు దుమారం రేపగా ఆ తరువాత అఫీషియల్ గా వారికి క్షమాపణలు చెపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు బాలకృష్ణ.

కరోనా సమయంలో టికెట్ల గురించి మాట్లాడడానికి వెళ్లగా ఆ సమయంలో తనని పిలవకపోవడంతో వాళ్లు భూముల గురించి మాట్లాడుకోవడానికి వెళ్లినట్టున్నారు అని బాలయ్య అనడం చాలా పెద్ద వివాదానికి దారి తీసింది.ఇలా ఒక్కటేమిటి బాలయ్య బాబు ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు నోరు జారి అనేక వివాదాలు కొని తెచ్చుకున్నారు అంటూ ఆ వివాదాలను ప్రస్తుతం లేవనెత్తి బాలయ్య బాబు పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

బాలయ్య బాబుకు వివాదం కొత్త ఏమీ కాదు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా మరికొందరు రాంగోపాల్ వర్మతో కూడా పోలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు