ఫ్యామిలీకి దూరంగా గౌతమ్... ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనం?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండగా తన భార్య నమ్రత ( Namrata) పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు.

తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారనే విషయం మనకు తెలిసిందే.మహేష్ బాబు సినిమాల గురించి అలాగే తన పిల్లల గురించి కూడా నమ్రత ఎప్పటికప్పుడు అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె గౌతమ్( Gautham ) తో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ తన కుమారుడి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.గౌతమ్ ప్రస్తుతం ఉన్నత చదువుల నిమిత్తం న్యూయార్క్ వెళ్లారని తెలుస్తోంది.ఇలా న్యూయార్క్ యూనివర్సిటీలో గౌతమ్ ఉన్నత చదువులు చదవడం కోసం వెళ్లారని నమ్రత తెలియజేశారు ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

నీ హార్డ్ వర్క్ ఫ్యాషన్ సంకల్పం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ తన కొడుకు గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

గౌతమ్ ఉన్నత చదువుల కోసం ఘట్టమనేని కుటుంబానికి దూరం కాబోతున్నారని తెలుస్తోంది.న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదవడం కోసం వెళ్తున్నారని తెలిసినప్పటికీ ఏం చదువుతున్నారు అనే విషయాలను మాత్రం నమ్రత తెలియజేయలేదు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు