నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్.. ఎవరికి పట్టం కడుతున్నారంటే.. ?

రాష్ట్రంలో కరోనా కాలనాగులా తన విషాన్ని కక్కుతున్న, ఎన్నికలు మాత్రం ఆగలేదు.ప్రజలు చచ్చిపోతున్నా సరే.

కోవిడ్ సునామిలో కొట్టుమిట్టాడుతున్న సరే పదవులే ముఖ్యం అని ఈ వైరస్‌ను లెక్క చేయకుండా మొత్తానికి ప్రచారాన్ని, ఎన్నికలను పూర్తి చేసుకున్నారు వివిధ పార్టీ నేతలు.ఇక ఈ ఎన్నికలో డబ్బు, మద్యం గుట్టుచప్పుడు కాకుండా ఓటర్ల దగ్గరికి చేరుకుందన్న నిగూడ రహస్యం అందరికి తెలిసిందే.

Nagarjunasagar By Election Exit Polls , Nagarjuna Sagar, Exit Polls, Results, By

ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 17న జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఇక్కడ ఎవరికి ఎంత ఎంత మెజారిటి వస్తుందో అనే విషయాన్ని ఆరా సంస్థ వెల్లడించింది.

వీరి వివరాల ప్రకారం.టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది.ఇక మరో సంస్ద అయిన ఆత్మసాక్షి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తెలియ చేసింది.వీరి సర్వేలో కూడా కారు గుర్తుకు 43.5 శాతం, కాంగ్రెస్ పార్టీకి 36.5 శాతం, బీజేపీకి 14.6 శాతం ఓటింగ్ వచ్చినట్టు వెల్లడించింది.

Advertisement
మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి

తాజా వార్తలు