నాగ్‌ మూడవ ప్రాజెక్ట్‌ కూడా సిద్దంగా ఉంది... అక్కినేని ఫ్యాన్స్‌కు పండుగే

అక్కినేని హీరో నాగార్జున ఆఫీసర్‌, దేవదాసు చిత్రాల తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.

ఆ చిత్రాలు, అంతకు ముందు చేసిన సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయిన కారణంగా తీవ్ర నిరుత్సాహంలో ఉన్న నాగార్జున ఆచితూచి సినిమాలను ఎంపిక చేస్తున్నాడు.

తాజాగా నాగార్జున మన్మధుడు 2 చిత్రంకు ఓకే చెప్పాడు, రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కబోతుంది.ఈనెల చివర్లోనే మన్మధుడు 2 చిత్రం ఉంటుందని అంతా చెబుతున్నారు.

మరో వైపు బంగార్రాజు చిత్రం కూడా పట్టాలెక్కబోతుంది.కళ్యాణ్‌ కృష్ణ చాలా రోజులుగా బంగార్రాజు కథ పై కూర్చున్నాడు.

ఎట్టకేలకు కథ సెట్‌ అవ్వడంతో స్క్రిప్ట్‌ పనిలో ఉన్నాడు.త్వరలోనే ఈ సినిమాను కూడా నాగార్జున చేయబోతున్నాడు.

Advertisement

స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ లో ఈ రెండు సినిమాలను నాగార్జున నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఇలాంటి సమయంలోనే నాగార్జున మూడవ సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న రాజుగారి గది 3 చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో కనిపించే అవకాశం కనిపిస్తుంది.రాజుగారి గది 2 చిత్రంలో నాగార్జున మరియు సమంత నటించారు.ఇప్పుడు 3లో మాత్రం సమంత స్థానంలో తమన్నా రానుండగా, నాగార్జున కొనసాగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా కూడా ప్రారంభం కాబోతుంది.ఒకేసారి మూడు సినిమాలతో నాగార్జున దుమ్ము రేపబోతున్నాడు.ఇది ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.

తాజా వార్తలు