నాగచైతన్య శోభిత పెళ్లి... శోభిత ఫ్యామిలీ ఆ ఒక్కటి అడిగారు : నాగార్జున

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ అలాగే సోషల్ మీడియాలో నాగచైతన్య( Nagachaitanya ) శోభిత ( Sobhita ) పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే.

ఇలా సమంత( Samantha ) కు విడాకులు ఇచ్చిన నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డారు అయితే వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచి ఏకంగా నిశ్చితార్థంతో అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 4వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య శోభితకు సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వినపడుతూనే ఉంది.

Nagarjuna Interesting Comments On Chaitanya And Sobhita Marriage , Nagachaitanya

ఇకపోతే ఇటీవల అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా ఓ సినిమా వేడుకలో పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమంలో శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.ఇక ఈ కార్యక్రమం అనంతరం నాగార్జున( Nagarjuna ) ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నాగచైతన్య శోభిత పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నాగచైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement
Nagarjuna Interesting Comments On Chaitanya And Sobhita Marriage , Nagachaitanya

అన్నపూర్ణ స్టూడియో అంటే మాకు స్టూడియో మాత్రమే కాదు ఒక ఇల్లు లాంటిది అని తెలిపారు.

Nagarjuna Interesting Comments On Chaitanya And Sobhita Marriage , Nagachaitanya

నాన్నగారికి ఈ స్టూడియో అంటే చాలా ఇష్టం అలాంటి చోట నాగచైతన్య శోభిత పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని వారిద్దరిపై నాన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని వారి జీవితం బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే వీరి పెళ్లిని ఇక్కడ నిర్ణయించామని తెలిపారు.ఇక శోభిత నాగచైతన్య పెళ్లి గురించి శోభిత ఫ్యామిలీ మమ్మల్ని ఒకటే విషయం అడిగింది.పెళ్లికి సంబంధించి ఇతర వేడుకలు ఎలా జరిపిన అది మీ ఇష్టం కానీ పెళ్లి మాత్రం సాంప్రదాయ పద్ధతిలోనే జరగాలని వేదమంత్రాల నడుమ వీరిద్దరి వివాహం జరగాలని కోరుకున్నారు అలా వారు కోరుకున్న విధంగానే వీరిద్దరి వివాహాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిపించబోతున్నట్లు నాగార్జున చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు