మహేష్ తో వర్క్ చేసేందుకు నాగ్ వెయిటింగ్ అట.. మరి ఎప్పుడు జరుగుతుందో?

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇది వరకు ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో నటించడం వంటివి చేసే వారు కాదు.

ఈగో కు పోయి ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ అయినా నేను ఎందుకు చేయాలి అని అనుకునే వారు.కానీ ఇప్పుడు అలా కాదు మేమంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు.

ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్స్ చేయడానికి సైతం వెనుకాడడం లేదు.ఇక తాజాగా కింగ్ నాగార్జున సైతం మహేష్ బాబు సినిమాలో నటించ డానికి వైట్ చేస్తున్నాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్య పరిచాడు.

అసలు వివరాల్లోకి వెళ్తే.తాజాగా నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్ సినిమా ఒకటి.

Advertisement
Nagarjuna Interested To Work With Mahesh Babu Details, Mahesh Babu,The Ghost, Na

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాను దసరాకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చెయ్యగా.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

Nagarjuna Interested To Work With Mahesh Babu Details, Mahesh Babu,the Ghost, Na

కర్నూల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా.ఈ ఈవెంట్ లో ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాగార్జున తన మనసులో ఉన్న మాట బయటపెట్టారు.

నా కొడుకులతో నటించాను.ఇతర హీరోలతో కూడా పని చేశాను.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?

సూపర్ స్టార్ కృష్ణ గారితో కూడా వారసుడు సినిమా చేశాను.కానీ మహేష్ బాబుతో ఇంత వరకు నటించలేదు.

Advertisement

అదెప్పుడు జరుగుతుందో అని తన మనసులో ఉన్న మాట తెలిపారు.మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు.

నేను ఆయనతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కింగ్ చెప్పుకొచ్చాడు.మరి మహేష్ ఏ సినిమాలో అవకాశం ఇస్తారో చూడాలి.

తాజా వార్తలు