మెగాస్టార్‌ మూవీలో మన్మధుడు

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు 9 సంవత్సరాల తర్వాత నటిస్తున్న సినిమాకు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుగబోతున్న విషయం తెల్సిందే.

చిరంజీవి నటించనున్న ఈ 150వ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే ఈ సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాధ్‌ వహించనున్నట్లుగా అధికారిక క్లారిటీ వచ్చింది.ఇక ఈ సినిమాను రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ముఖ్య పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తోంది.చిరంజీవి, నాగార్జునల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి.

వీరిద్దరి కలయికలో గతంలోనే సినిమా వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.కాని అది ఇప్పటికి సాధ్యం అయ్యింది.

Advertisement

చిరంజీవి 150వ సినిమాకు మరింత క్రేజ్‌ పెంచేందుకు మేకర్స్‌ ఈ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.నాగార్జున కోసం ఒక ప్రత్యేక పాత్రను దర్శకుడు పూరి జగన్నాద్‌ రాస్తున్నట్లుగా సినీ వర్గాలల్లో ప్రచారం జరుగుతోంది.

వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌, హీరోయిన్‌, విడుదల తేదీ ఫిక్స్‌ కాలేదు.

అయినా కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక నాగార్జున నటించనుండటంతో అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.

తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 
Advertisement

తాజా వార్తలు