నాగార్జున సినిమాకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.. ఇక జెట్ స్పీడ్ తో షూటింగ్‌

నాగార్జున( Nagarjuna ) బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో కాస్త చిరాగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయన తదుపరి సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bejwada ) దర్శకత్వంలో ప్రారంభం అయిందని ప్రచారం జరిగింది.

కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాలేదు.దాంతో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా చిత్రీకరణ ఇప్పటికే జరుగుతుంది.అయితే ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న సినిమా ఒక సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.

ఆ రీమేక్‌ హక్కుల విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.ఆ విషయంలో కాపీరైట్స్ ఇష్యూ కారణంగా ఇన్నాళ్లు అధికారికంగా ప్రకటించలేదట.

Advertisement

అయితే ఇటీవల కాపీరైట్స్ ఇష్యూ మొత్తం క్లియర్ అయింది.అందుకే అతి త్వరలోనే సినిమా ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.అయినా కూడా పూజా కార్యక్రమాలను లాంఛనంగా నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించాం అన్నట్లుగా చెప్పాలని భావిస్తున్నారట.అన్ని అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే నాగార్జున, ప్రసన్నకుమార్ బెజవాడ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

నాగార్జున ఈ సంవత్సరంలో ఒక సినిమా ను విడుదల చేయాలి.అది సక్సెస్ అవ్వాలి అని భావిస్తున్నాడు.ధమాకా సినిమా( Dhamaka movie ) తో సక్సెస్‌ ఫుల్‌ రైటర్ గా పేరు దక్కించుకున్న ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమా తో దర్శకుడిగా సక్సెస్ సొంతం చేసుకుంటాడని సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.

నాగార్జున కు సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా తాను సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.నాగార్జున బంగార్రాజు సినిమా తో కాస్త పర్వాలేదు అనిపించుకున్నా కూడా ది ఘోస్ట్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

అందుకే ఈ సినిమా పై ఎక్కువగా ఫోకస్ ఉందట.

Advertisement

తాజా వార్తలు