విడాకులు చైతూ దురదృష్టం.. ఇట్స్ గాన్.. మీరు కూడా వదిలేయండి.. నాగ్ ఎమోషనల్!

నాగ చైతన్య-సమంత జంట విడాకులు తీసుకున్నారంటే ఇప్పటికి ప్రేక్షకులు అంగీకరించడం లేదు.

ఇంకా ఈ జంట కలిస్తే బాగుండు అని కోరుకొని ప్రేక్షకులు లేరు అంటే అతియసోక్తి కాదేమో.

అయితే వీరి బంధానికి భేదాభిప్రాయాలు వచ్చి చాలా కాలం అయ్యింది.వీరి విడాకులు కూడా జరిగి పోయాయి.

అయినా కూడా వీరు ఎక్కడికి వెళ్లిన ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తున్నారు.తాజాగా నాగార్జున ను కూడా ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది.

అపట్లో ఇదే విషయంపై నాగ్ తన వృత్తి గురించి మాత్రమే రాయాలని మీడియాను కోరారు.ఇక ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్లినా అదే ప్రశ్న ఎదురవడంతో ఈసారి కాస్త ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

ఈయన నటించిన బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది.రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్టీ తెరకెక్కించారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు నాగ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా నాగార్జున ముంబైలో మీడియాతో మాట్లాడారు.ఈయనను చై,సామ్ గురించి అడుగగా.ఈయన ఈ విషయంపై స్పందించారు.

నాగ చైతన్య సంతోషంగా ఉన్నాడు.నాకు అంతే చాలు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

విడాకులు అతడి అనుభవం.దురదృష్టకరం.

Advertisement

ఇంకా దాని గురించి ఆలోచించలేం.ఇట్స్ గాన్.

అది దూరం అయ్యింది.మీరు కూడా అందులో నుండి బయట పదండి.

అంటూ ఎమోషనల్ వర్డ్స్ చెప్పుకొచ్చాడు.ఈ వ్యాఖ్యలు ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు