సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి మాత్రమే అది సాధ్యం

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరగ్రీన్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే కచ్చితంగా కింగ్ నాగార్జున అని చెప్పాలి.ఎవరికైనా వయసుతో పాటు గ్లామర్ దెబ్బ తింటుంది.

కాని నాగార్జునకి మాత్రం వయసు పెరుగుతున్న కొద్ది గ్లామర్ కూడా పెరిగిపోతుంది.కెరియర్ ఆరంభంలో వీడు హీరో ఏంటి అని విమర్శించిన వాళ్ళే తరువాత హీరోగా నాగార్జునలా ఉండాలి అని పొగిడే స్థాయికి తన హ్యాండ్ సమ్ లుక్స్ తో చేరిపోయాడు.

ఇండస్ట్రీలో నాగార్జున వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చైతన్య, అఖిల్ కూడా నాగార్జునతో సినిమాల విషయంలో పోటీ పడలేకపోతున్నారు అంటే నాగార్జున సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ఇక కింగ్ నాగార్జున ప్రస్తుతం మన్మధుడు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమా ద్వారా నాగార్జున అరుదైన ఫీట్ ని సొంతం చేబుకోబోతున్నాడు.సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తండ్రితో చేసిన హీరోయిన్ తో జోడీ కట్టారు.

అయితే నాగార్జున మాత్రం తండ్రితో చేసిన హీరోయిన్ తో పాటు, కొడుకుతో చేసిన హీరోయిన్ తో కూడా జత కట్టడం ద్వారా రెండు జనరేషన్ హీరోయిన్ లతో రొమాన్స్ చేసే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి నాగార్జున పలు సూపర్‌ హిట్ సినిమాలు చేశాడు.తాజాగా తన తనయుడు నాగచైతన్య సరసన రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్‌ సింగ్‌తో ఇపుడు మన్మథుడు సీక్వెల్‌ లో నటిస్తున్నాడు.అంటే తండ్రి సరసన హీరోయిన్‌గా చేసిన భామతో, కొడుకు సరసన హీరోయిన్‌గా చేసిన భామతోనూ కలిసి నటించిన అరుదైన రికార్డ్‌ను సాధించాడు కింగ్‌ నాగార్జున సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్
Advertisement

తాజా వార్తలు