వీళ్లా తెలుగును ఉద్దరించేది?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంను పెట్టడం పట్ల కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే.

ముఖ్యంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌లు ఇంగ్లీష్‌ మీడియంను వద్దంటున్నారు.

అందుకు పలు కారణాలు లేకపోలేదు.వారు చేస్తున్న ఆరోపణలు మరియు వారి వివరణను వైకాపా నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

మంత్రులు మరియు పలువురు పార్టీ నాయకులు వారిద్దరి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇప్పటికే జగన్‌ నేరుగా వారిద్దరిపై సెటైర్లు వేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఈ విషయమై స్పందించింది.తెలుగును ఉద్దరించేందుకు చంద్రబాబు నాయుడు పవన్‌ వచ్చారా.

Advertisement

అసలు వారు తెలుగు గురించి మాట్లాడేందుకు అర్హులేనా అంటూ ప్రశ్నించింది.తెలుగు మీడియంను తీసేస్తున్నారు తప్ప తెలుగు సబ్జెక్ట్‌ను తీసేయడం లేదు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా ఈ సందర్బంగా రోజా సూచించింది.

లేని పోని ఆరోపణలు మాని అన్ని విధాలుగా ప్రభుత్వంకు మద్దతుగా నిలవాల్సిందిగా ఆమె కోరింది.ఎప్పుడు విమర్శలు చేస్తూ ప్రభుత్వం చేస్తున్న పనులను అడ్డుకోవద్దంటూ ఆమె హితవు పలికింది.

Advertisement

తాజా వార్తలు