ఆ హీరోయిన్ తో డేటింగ్ పై నవ్వుతూ జవాబిచ్చిన చైతన్య.. చాలా హ్యాపీగా ఉన్నానంటూ?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య( Naga Chaitanya ) సినిమాల విషయంలో వేగం పెంచారు.

నాగచైతన్య పారితోషికం 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా చైతన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

స్టార్ హీరోయిన్ తో చైతన్య డేటింగ్ లో(Dating) ఉన్నట్టు వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.ఆ వార్తల గురించి నాగచైతన్య దూత ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

చైతన్య విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు కావడం గమనార్హం.

నాగచైతన్య ప్రస్తుతం తండేల్( Thandel ) అనే సినిమాలో నటిస్తుండగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తన కెరీర్ గురించి చైతన్య మాట్లాడుతూ నటుడిగా ఇంకా చాలా పాత్రలు చేయాలని అన్నారు.

Advertisement

నటుడిగా ఎదగడానికి నేను ఇంకా కృషి చేస్తూనే ఉంటానని చైతన్య పేర్కొన్నారు.ఇన్నేళ్ల కెరీర్ లో జయాపజయాలు చూశానని చై చెప్పుకొచ్చారు.నటుడిగా ఇంకా సంతృప్తి దక్కలేదని ఇంకా చాలా సాధించాలని చైతన్య కామెంట్లు చేశారు.

దూత వెబ్ సిరీస్ కు( Dhootha ) సీజన్2, సీజన్3 ఐడియాలు కూడా ఉన్నాయని చైతన్య కామెంట్లు చేశారు.తండేల్ మూవీ షూట్ పాకిస్తాన్ లో కూడా జరుగుతుందని చైతన్య చెప్పుకొచ్చారు.

శోభితతో( Shobitha ) రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై చైతన్య స్పందిస్తూ రానివ్వండి నో ప్రాబ్లమ్ అంటూ నవ్వుతూ కామెంట్లు చేశారు.ఇలాంటి వాటి గురించి ఎంత చెప్పినా ఆగవని ఆయన కామెంట్లు చేశారు.వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నానని చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

చైతన్య చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!
Advertisement

తాజా వార్తలు