సీఎం జగన్ పై నాగబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ "జనవాణి" కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గర నుండి అర్జీలు తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ముద్దుల మామయ్య అంటూ వెటకారంగా సీఎం జగన్ నీ పవన్ విమర్శించడం జరిగింది.ఇప్పుడు ఇదే తరహాలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు.

కూడా ముద్దుల మామయ్య అంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 8వేల పాఠశాలలు మూసివేయడం ద్వారా ముద్దుల మామయ్య "అమ్మ ఒడి"ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

లేకపోతే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయటానికి అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నలకు కచ్చితంగా వైసీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 పాఠశాలలు మూతపడ్డాయని మరి అక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు ఏంటి అంటూ నాగబాబు సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు