Naga Shourya : సంపాదన కోసం కాదు.. మా ఫ్యామిలీ కోసం ఇండస్ట్రీకి వచ్చాను : నాగశౌర్య

టాలీవుడ్ హీరో నాగశౌర్య ( Naga Shourya )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాగశౌర్య తన తండ్రి శంకర్ ప్రసాద్( Shankar Prasad ) సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తల్లి ఉషా ముల్పూరి నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ బ్యానర్ లో నాలుగు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.అందులో చలో సినిమా మినహా మిగిలిన మూడు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇకపోతే నాగశౌర్య తాజాగా నటించిన రంగబలి సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది.ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి ( Pawan Basamshetty )దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో ( promotions )భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య సినిమా గురించి ఏదైనా వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.

Advertisement

రంగబలి సినిమాని చూసిన తర్వాత నమ్మకంతో నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను.ఈ సినిమా చాలా మంచి సినిమా.

నటుడికి దర్శకుడు స్పేస్ ఇవ్వాలి.ఆ స్పేస్ పవన్ నాకు ఇచ్చాడు.

ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని పవన్‌కి ముందే చెప్పాను.తను చెప్పింది చెప్పినట్లుగా తీశాడు.

నాకు నా సినిమాల విషయంలో అనుభవం ఉంది.ఎక్కడ కరెక్ట్‌గా జరుగుతుందో చెప్పలేను కానీ.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమైపోతుంది.

Advertisement

ఆ అనుభవాన్ని, పవన్ విజన్‌ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగాం అని తెలిపారు నాగ శౌర్య. ఐరా క్రియేషన్స్‌లో( Aira Creations ) చేసిన సినిమాల ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నకు నాగశౌర్య స్పందిస్తూ.ఏ ప్రొడక్షన్ హౌస్‌లో అయినా పది సినిమాలు హిట్లు పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు.

సినిమా అంటే పిచ్చి ప్యాషన్‌తో సినిమాలు నిర్మిస్తున్నాం తప్పితే డబ్బులు సంపాదించుకోవాలని కాదు.మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం.మాకు ఇది తప్పితే వేరేది తెలీదు అని స్పష్టం చేశారు నాగశౌర్య.

తాజా వార్తలు