సమంత చెయ్యి పట్టుకుంటే అలా అన్నారన్న ప్రముఖ నటుడు.. దెబ్బకు షాక్ అయ్యానంటూ?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు.

సామ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో రంగస్థలం( Rangasthalam ) కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సమంత తండ్రి పాత్రలో నాగ మహేష్( Naga Mahesh ) నటించారు.నాగ మహేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమా గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించడంతో నాకు సుకుమార్ నుంచి పిలుపు వచ్చిందని ఆయన అన్నారు.రంగస్థలం నాకు రెండో సినిమా అని మంచి రోల్ ఇవ్వాలని అడగగా ఆ రోల్ ఇచ్చారని నాగ మహేష్ వెల్లడించారు.

రంగస్థలం సినిమాలో ఇన్ స్పెక్టర్ వేషం కోసం పిలిపించి ఆ తర్వాత రోల్ మార్చారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.సుకుమార్ గారు( Sukumar ) నాకు హోమ్ వర్క్ ఏం ఇవ్వలేదని ఆయన అన్నారు.

Advertisement

సినిమాలో నన్ను తాగుబోతుగా చూపించారని ఆయన తెలిపారు.సమంతకు నన్ను నేను పరిచయం చేస్తున్నానని నాగ మహేశ్ పేర్కొన్నారు.ఒక సీన్ లో భాగంగా సమంత చెయ్యి పట్టుకుని లాగాలని సమంత గట్టిగా పట్టుకోండి పరవాలేదని చెప్పి ఆ సీన్ బాగా వచ్చేలా చేశారని నాగ మహేశ్ వెల్లడించారు.

సమంత అలా చెప్పడంలో షాక్ అయ్యానని నాగ మహేశ్ కామెంట్లు చేశారు.

భరత్ అనే నేను సినిమాలో( Bharath Ane Nenu ) మంచి రోల్ అని ఎడిటింగ్ లో నా సీన్లు కట్ అయ్యాయని నాగ మహేశ్ అన్నారు.నాగ మహేశ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగ మహేశ్ కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ నటుడి రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు