ఒక రోజు ముందే రాబోతున్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా, మాళవిక నాయర్‌, అవిక గౌర్‌ లు హీరోయిన్స్ గా విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వం లో రూపొందిన చిత్రం థాంక్యూ.

ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

నాగ చైతన్య ఈ సినిమా లో మూడు విభిన్నమైన ఏజ్‌ వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు.గతంలో ప్రేమమ్‌ లో కూడా ఇలాగే కనిపించి చైతూ ఆకట్టుకున్నాడు.

ఆ సినిమా కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అంతే కాకుండా మనం సినిమా కోసం దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తో వర్క్ చేసిన నాగ చైతన్య ఇప్పుడు మళ్లీ థాంక్యూ సినిమా కోసం వర్క్ చేశాడు.

తప్పకుండా ఈ సినిమా ఆయన్నకు విజయాన్ని సొంతం చేస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.హీరోగా థాంక్యూ సినిమా తో నాగ చైతన్య మరో రెండు మెట్టులు ఎక్కుతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

ఇదే సమయంలో సినిమా ను ముందు రోజు అంటే నేడు సినిమాను స్క్రీనింగ్‌ కు ఏర్పాట్లు చేశారట.తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండే పలు థియేటర్లలో భారీ మొత్తం లో ప్రదర్శించబోతున్నారట.

నేడు సినిమా ను ప్రదర్శించడం అంటే చాలా పెద్ద నిర్ణయం.సినిమా బాగుంది అంటేనే ప్రీమియర్ లు వేస్తారు.

ఫలితం కాస్త అటు ఇటు అయితే ఖచ్చితంగా రేపు ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.అయినా కూడా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే వంద స్క్రీన్స్‌ లో ప్రీమియర్ ను వేసేందుకు దిల్‌ రాజు ప్లాన్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి.

నాగ చైతన్య ముందు రోజే రాబోతున్న నేపథ్యం లో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అవుతుంది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

నేడే సినిమా ఫలితం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement