అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య( Naga Chaitanya ) ఒకరు.
అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తున్న చైతూకు ఈ మధ్య మళ్ళీ వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి.
మజిలీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు.బంగార్రాజు హిట్ అయినా అంతగా కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.
తాజాగా వచ్చిన కస్టడీ( Custody ) కూడా చైతును ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయింది.
నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.NC23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి మరోసారి నటిస్తుంది.ఇప్పటికే ఈ జంట లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
దీంతో ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనుంది.ఇదిలా ఉండగా ఈసారి ఈ సినిమాను భారీ స్థాయిలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ సినిమాగా నిర్మించనున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా గత కొన్ని వారాలుగా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త వైరల్ అయ్యింది.
ఈ సినిమా కోసం ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ను తీసుకోవాలని అనుకున్నారట.కానీ ఈయన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇతడి బదులుగా ఇప్పుడు సంతోష్ నారాయణ్( Santhosh Narayanan ) ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.కాగా ఈ సినిమా అక్టోబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక చైతూ ఈ సినిమాలో మత్సకారుడిగా కనిపించనున్నట్టు ఇప్పటికే కథనాలు వచ్చాయి.మరి ఈసారి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy