చందూ - చైతూ.. కాంబో సెట్ అయ్యేందుకు ఇంకాస్త సమయం ఉందా?

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య( Naga Chaitanya ) ఒకరు.

ఈయన ఎంట్రీ ఇవ్వడం ప్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం మంచి హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.

అయితే ఈ మధ్య మళ్ళీ ఈయన టైం బాలేనట్టు అనిపిస్తుంది.థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా తాజాగా వచ్చిన కస్టడీ ( Custody Movie ) కూడా ఈయనను ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయాయి.

నాగ చైతన్య వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్ర నిరాశ పరిచింది.ఇక ఈ సినిమా తర్వాత చైతూ ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈయన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చేస్తున్నాడు అని తెలుస్తుంది.అల్లు అరవింద్ చెయ్యి పడ్డాక ఆ సినిమా హిట్ అయినట్టే అని ఈసారి చైతూకు ఖచ్చితంగా హిట్ అందుతుంది అని అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ఫిక్స్ అయ్యింది కానీ రెండు పాయింట్స్ దగ్గర బ్రేక్స్ పడినట్టు తెలుస్తుంది.ఈ కథ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎప్పటి నుండో ఉందని.మినిమమ్ చైతన్య కోసం 60 కోట్లతో తెరకెక్కించనున్నారు అని టాక్.

Advertisement

అందుకే అంత ఖర్చు తిరిగి రాబట్టాలంటే చందు మొండేటి( Chandoo Mondeti ) కరెక్ట్ అని ఆయనతో సినిమా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.కానీ ఈయన ఇప్పటికే సూర్యతో కమిట్ అయ్యాడు.

సూర్య ఫ్రీ అయ్యేలోపు చైతూ సినిమా ముగించాలని అల్లు అరవింద్ ప్లాన్.ఈ క్రమంలోనే చైతూ సలహా ప్రకారం స్క్రిప్ట్ సెకండాఫ్ లో ఈ సినిమా చిన్న చిన్న మార్పులు చేసి నిర్మాతలు ఓకే అంటే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందట.ఆ తర్వాత డైరెక్టర్ చందు నా లేదంటే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో వేరే వారితో చేయిస్తారా అనేది చూడాలి.

ఏది ఏమైనా ఇది గీతా ఆర్ట్స్ నుండి రాబోతున్న పెద్ద సినిమానే అని చెప్పాలి.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు