విజయ్ సక్సెస్ సాధిస్తే ఏపీ వరకు రీసౌండ్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్( Dalapathy Vijay ) గురించి మనందరికీ తెలిసిందే.

విజయ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

ప్రస్తుతం విజయ్ ది గోట్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.వెంకట్ ప్రభు ( Venkat Prabhu )ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ గా నటిస్తోంది.సెప్టెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై అక్కినేని నాగచైతన్య చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా చెన్నైలో( Chennai ) జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్‌కి హాజరైన చైతూ విజయ్ సినిమా గురించి మాట్లాడారు.నాగ చైతన్య స్టేజ్ మీదకి రాగానే విజయ్ ది గోట్ సినిమాలో ( The Goat )పోస్టర్ స్క్రీన్ మీద వేసి దీని గురించి ఏమంటారు అంటూ యాంకర్ అడగగా.

కస్టడీ సినిమా షూటింగ్ సమయంలో ది గోట్ చిత్రం స్టోరీ లైన్ గురించి వెంకట్ ప్రభు నాతో చెప్పారు.ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

అది గ్యారెంటీ.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఆయనతో కలిసి పని చేయడం చాలా గొప్పగా అనిపించింది.విజయ్ సార్ సినిమా హిట్టు అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు.తమిళనాడు నుంచి ఆంధ్ర వరకూ రీసౌండ్ వస్తుంది అని నాగ చైతన్య తెలిపారు.

Advertisement

ఇక ఈ వీడియోను చైతూ ఫ్యాన్స్ హ్యాండిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా విజయ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.ఇకపోతే నాగచైతన్య విషయానికి వస్తే.తాజాగా చైతన్య నటి శోబిత తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక చైతన్య కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తున్నారు.చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.

తాజా వార్తలు